3న శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు
తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడి
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల ఫిబ్రవరిలో శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సును నిర్వహించనున్నట్లు వెల్లడించి. ఈ ధార్మిక సదస్సు మూడు రోజుల పాటు జరగనుందని తెలిపింది. తిరుమల లోని ఆస్థాన మండపంలో 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుందని పేర్కొంది.
ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న మఠాలు, పీఠాలకు చెందిన మఠాధిపతులు, స్వామీజీలతో పాటు భావ సారూప్యత కలిగిన సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు రానున్నారని తెలిపింది టీటీడీ. సదస్సు కు భారీ ఎత్తున తరలి రానుండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా సీనియర్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది.
ఆయా పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలకు సంబంధించిన ఏర్పాట్లను కమిటీ లోని అధికారులు పర్యవేక్షిస్తారు. వారికి వసతి సౌకర్యాలను కల్పించడంతో పాటు ఇతర సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టనున్నారని టీటీడీ తెలిపింది.