ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు
ప్రకటించిన డీఐజీ రాజేంద్ర నాథ్ రెడ్డి
అమరావతి – త్వరలో ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ డీఐజీ , పోలీస్ బాస్ రాజేంద్ర నాథ్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 30 మంది ఐపీఎస్ లను బదిలీ చేశారు. దీంతో ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఇదిలా ఉండగా బదిలీ అయిన వారిలో కీలక ఆఫీసర్లు ఉండడం విశేషం.
రైల్వేస్ డీజీగా కుమార్ విశ్వజిత్ ను నియమించారు . ఏపీ ఎస్పీ ఏడీజీగా అతుల్ సింగ్ , ఆక్టోపస్ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్ , విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ గా కొల్లి రఘు రాం రెడ్డి, ఎల్ఎల్పీబీ చైర్మన్ తో పాటు హోమ్ గార్డ్స్ ఐజీగా అదనపు బాధ్యతలను ఎస్వీ రాజశేఖర్ బాబుకు అప్పగించారు డీఐజీ.
సీఐడీ ఐజీగా సర్వ శ్రేష్ట్ త్రిపాఠి, ఐజీ పర్సనల్ ఆపీసర్ గా ఎస్ హరికృష్ణ, స్పోర్ట్స్ ఐజీగా కేవీ మోహన్ రావు, ఆక్టోపస్ డీఐజీతో పాటు లా అండ్ ఆర్డర్ డీఐజీగా సెంథిల్ కుమార్ , ట్రైనింగ్స్ డీఐజీగా రాహుల్ దేవ్ శర్మ, విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్నీ, కర్నూల్ రేంజ్ డీఐజీగా సిహెచ్ విజయ రావ్ , విశాఖ జాయింట్ కమిషనర్ గా ఫకీరప్పను నియమించారు.
కృష్ణా జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమ్ హస్మి, ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్ గా అమిత్ బర్దార్ , ఐఎస్ డబ్ల్యూ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ , వెస్ట్ గోదావరి ఎస్పీగా అజిత వెజెండ్ల, రాజమండ్రి రీజినల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ గా సుబ్బారెడ్డిని నియమించారు.
సీఐ సెల్ ఎస్పీగా రిశాంత్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీగా జాషువా, ఏసీబీ ఎస్పీగా యు. రవి ప్రకాష్ , విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా చంధోలు మణికంఠ, ఎపీ ఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ గా కృష్ణ కాంత్ పటేల్ , గుంటూరు జిల్లా ఎస్పీగా తుషార్ దుడి, జగ్గయ్య పేట డీసీపీగా శ్రీనివాసరావు, రంప చోడవరం ఏఎస్పీగా కునుబిల్లి ధీరజ్ , పాడేరు ఏఎస్పీగా జగదీష్ అదహళ్లి, విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా ఆనంద్ రెడ్డి, విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ -2గా మోకా సత్యనారాయణను నియమించారు.