420 హామీలు జనం చెవుల్లో పూలు
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ శ్రేణులు
హైదరాబాద్ – రాష్ట్రంలో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ జోష్ పెంచింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తం అవుతోంది. ఈ మేరకు ఆయా లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. అత్యధిక స్థానాలు కారుకే ఉండగా మిగతా స్థానాలలో భారతీయ జనతా పార్టీ కొలువు తీరింది.
ఇదిలా ఉండగా ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత దెబ్బకు బీఆర్ఎస్ కుప్ప కూలింది. గద్దె దిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో జనంలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ హామీలే ఆ పార్టీని సర్కార్ ఏర్పాటు చేసేలా చేసింది. దీంతో నెల రోజులు పూర్తయినా ఇంకా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపించింది బీఆర్ఎస్.
ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, నాయకులు, శ్రేణులు మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేయడం ప్రారంభించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు హామీలు కాదని 420 హామీలంటూ నినాదాలు చేయడం సంచలనంగా మారింది. ఈ మేరకు ప్ల కార్డులతో హోరెత్తిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా.