జీఎస్టీ ఫైల్ చేసేందుకు గడువు పెంపు
కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ – కేంద్రంలో కొత్తగా కొలువు తీరిన మోడీ ప్రభుత్వం పన్ను మోతపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జీఎస్టీ పేరుతో కోట్లాది మంది ప్రజల రక్తం పీల్చుతోంది . తాజాగా న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కీలక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి దేశంలోని ఆయా రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆర్థిక శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను డిమాండ్ నోటీసుల పెనాల్టీలపై వడ్డీ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా. సీజీఎస్టీ చట్టంలో సవరణలు. ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్‌లో మార్పులు. రైల్వే సేవలకు జీఎస్టీ మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. పాల డబ్బాలు, కార్టన్ బాక్సులు, స్ర్పింకర్టపై జీఎస్టీ 12 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా జూన్ 30 వరకు జీఎస్టీఆర్-4 ఫైల్ చేయడానికి గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి.