70 రోజులు 140 సభల్లో మోదీ
ప్రచారానికి బీజేపీ శ్రీకారం
న్యూఢిల్లీ – వచ్చే నెల ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఏప్రిల్ నెలలో దేశ మంతటా పోలింగ్ జరగనుంది. దీంతో ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో మునిగి పోయాయి.
ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి చైర్మన్ గా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యవహరిస్తారు. ఈ మేరకు అంతా కలిసి ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. మరో వైపు బీజేపీ ఈసారి ఎలాగైనా సరే మూడోసారి అధికారంలోకి రావాలని డిసైడ్ అయ్యింది.
మరోసారి జనాకర్షక కలిగిన నాయకుడిగా ఇటు దేశంలో అటు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముందుంచి ఎన్నికల్లోకి వెళ్లాలని నిర్ణయించింది బీజేపీ హైకమాండ్. ఇప్పటికే వ్యూహాలు పన్నింది. అన్ని రాష్ట్రాలకు ఇంఛార్జ్ లను వేసింది.
రామ జన్మ భూమిలో శ్రీరాముడి విగ్రహం పునః ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా 70 రోజుల పాటు పర్యటించనున్నారు. మొత్తం 140 సభల్లో పాల్గొంటారని బీజేపీ వెల్లడి.