9 నుంచి స్కూళ్లకు సెలవులు
ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
అమరావతి – జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా జనవరి 9 నుంచి 18 వరకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది.
మొత్తం 10 రోజుల పాటు సెలవులు ప్రకటించడం విద్యార్థులు సంతోషానికి లోనవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కంటే ఎక్కువగా సంక్రాంతి పండుగను ఘణంగా జరుపుకుంటారు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
ఇదిలా ఉండగా జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము ప్రకటించిన సెలవు రోజుల్లో ఎవరైనా వ్యక్తిగతంగా లేదా సంస్థాగత పరంగా తరగతులు నిర్వహిస్తే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక నారాయణ, శ్రీ చైతన్య, గౌతమి, తదితర విద్యా సంస్థలు పిల్లలను బలవంతంగా క్లాసుల పేరుతో హింసించడం జరుగుతున్నదే.
దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థినీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగ సెలవులను గడపాలని సూచించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా రాష్ట్రంలో పండుగ వాతావరణం అప్పుడే వచ్చేసింది.