రాజస్థాన్ రాయల్స్ విక్టరీ
దంచి కొట్టిన జోష్ బట్లర్
కోల్ కతా – ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ ఆద్యంతరం ఉత్కంఠ భరితంగా సాగింది. కోల్ కతా ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ సెన్సేషన్ సెంచరీ సాధించాడు. అనంతరం 224 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపింది. ఈ మ్యాచ్ లో ఇద్దరు సెంచరీల మోత మోగించారు.
ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా చెక్కు చెదరకుండా అడ్డు గోడలా నిలిచాడు. ఒంటి చేత్తో రాజస్థాన్ రాయల్స్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు జోస్ బట్లర్. ఒక్కడై 107 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచి గెలిపించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ . ఊహించని సక్సెస్ .
చివరి దాకా కోల్ కతా నైట్ రైడర్స్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ రియాన్ పరాగ్ , పోవెల్ కోల్ కతా బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇక జోస్ బట్లర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అడ్డు గోడలా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ కు రాజసమైన గెలుపును చేతిలో పెట్టాడు జోస్ బట్లర్.
జైశ్వాల్ , శాంసన్ నిరాశ పరిచారు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన అశ్విన్ , సిమ్రోన్ హిట్ మైర్ ఫెయిల్ అయ్యారు. ఇక సెంచరీతో ఆకట్టుకున్నాడు నరైన్ . 109 రన్స్ చేశాడు. 30 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.