SPORTS

న‌రైన్ సెన్సేష‌న్ సెంచ‌రీ

Share it with your family & friends

రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌కు షాక్

కోల్ క‌తా – ఐపీఎల్ 2024లో సెంచ‌రీల మోత మోగుతోంది. నిన్న ట్రావిస్ హెడ్ దంచి కొడితే ఇవాళ ఈడెన్ గార్డెన్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారింది. టాస్ గెలిచిన రాజ‌స్థాన్ స్కిప్ప‌ర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

దీంతో మైదానంలోకి దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో భారీ స్కోర్ న‌మోదు చేసింది. 6 వికెట్లు కోల్పోయి 223 ప‌రుగులు చేసింది. కోల్ క‌తా జ‌ట్టులో సునీల్ న‌రైన్ దుమ్ము రేపాడు. అద్బుత‌మైన సెంచ‌రీ సాధించాడు. ఏకంగా 109 ర‌న్స్ చేసి కీల‌క పాత్ర పోషించాడు.

ఆఖ‌రున వ‌చ్చిన రింకూ సింగ్ 9 బంతుల్లో 20 ర‌న్స్ చేశాడు. సాల్ట్ 10 ప‌రుగులు చేస్తే , రఘువంశీ 30 ర‌న్స్ చేసి ఆక‌ట్టుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ 11 ప‌రుగుల‌తో నిరాశ ప‌రిచాడు. ఆండ్రూ ర‌స్సెల్ 13 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. ఓ వైపు వికెట్లు పోతున్నా ఎక్క‌డా త‌ల వంచ లేదు న‌రైన్. అయ్య‌ర్ 8 కే వెనుదిరిగాడు.

యుజ్వేంద్ర చాహ‌ల్ భారీగా ప‌రుగులు ఇచ్చాడు. మొత్తంగా 224 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ రాజ‌స్థాన్ ముందుంచింది.