గ్యారెంటీలు కావవి గారడీలు
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్
వనపర్తి జిల్లా – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ మాయ మాటలు చెప్పిందని మండిపడ్డారు. అర చేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. జనం ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతల్లో చూపించడం లేదన్నారు. పాలన అదుపు తప్పుతోందని, అసలు రాష్ట్రంలో సర్కార్ అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 100 రోజుల్లో ఆరు హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేక పోయారని ధ్వజమెత్తారు .
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి నియోజకవర్గం ఖిలా ఘనపురంలోని పద్మశాలి భవన్ లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన పార్టీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, త్వరలోనే ఆ విషయం తేలుతుందన్నారు.