NEWSNATIONAL

కేజ్రీవాల్ పై క‌క్ష సాధింపు త‌గ‌దు

Share it with your family & friends

ఆప్ నేత సంజ‌య్ ఆజాద్ సింగ్
న్యూఢిల్లీ – ఆప్ సీనియ‌ర్ నాయ‌కుడు , ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్ నిప్పులు చెరిగారు. ఎలాంటి ఆధారాలు లేక పోయినా కావాల‌ని త‌మ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను జైలులో పెట్టార‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచిది కాద‌న్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఢిల్లీలో పాగా వేయాల‌నే దురుద్దేశంతోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కావాల‌ని కేసు న‌మోదు చేయించేలా చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సంజ‌య్ సింగ్. కానీ ప్ర‌జ‌లు మోదీ కంటే తెలివి క‌లవార‌ని త్వ‌ర‌లోనే తేలుతుంద‌న్నారు.

చివ‌ర‌కు సీఎంగా ఉండ కూడ‌ద‌ని కుట్ర ప‌న్నార‌ని, కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు సీఎంగా ఉండ వ‌చ్చ‌ని కోర్టు తీర్పు చెప్పింద‌న్నారు. బీజేపీ ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా, ఎంత‌గా దుష్ప్ర‌చారం చేసినా చివ‌ర‌కు ఆప్ విజ‌యం సాధించ‌క త‌ప్ప‌ద‌న్నారు సంజ‌య్ సింగ్.

వ్య‌వ‌స్థ‌ల‌ను గుప్పిట్లో పెట్టుకుని, వ‌నరుల విధ్వంసానికి పాల్ప‌డుతున్న వారికి వ‌త్తాసు ప‌లుకుతున్న మోదీకి, ఆయ‌న ప‌రివారానికి, బీజేపీకి, దాని అనుబంధ సంస్థ‌ల‌కు త‌గిన రీతిలో జ‌నం బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని అన్నారు సంజ‌య్ సింగ్.