బీజేపీ క్లీన్ స్వీప్ ఖాయం
కేంద్ర మంత్రి అమిత్ షా
ప్రపంచ వ్యాప్తంగా మోదీకి జనం నీరాజనం పలుకుతున్నారని చెప్పారు. తాము ఈ ఏడాది 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల గురించి ఆలోచించడం లేదన్నారు అమిత్ షా. రాబోయే 2047 గురించి ప్లాన్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
అభివృద్ది , సంక్షేమం తమ ముందున్న లక్ష్యమని చెప్పారు కేంద్ర మంత్రి. అన్ని రంగాలలో దేశం ముందుకు సాగుతోందన్నారు. ఈ క్రెడిట్ అంతా నరేంద్ర దామోదర దాస్ మోదీకే దక్కుతుందన్నారు అమిత్ చంద్ర షా.
తాము దేశ పునర్ నిర్మాణం కోసం ఆలోచిస్తున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని కానీ ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి మాత్రం నిరాధార ఆరోపణలు చేస్తూ అడ్డంకిగా మారాయని మండిపడ్డారు.