చరిత్ర రిపీట్ అవుతుంది – సీఎం
నిప్పులు చెరిగిన ఎంకే స్టాలిన్
తమిళనాడు – సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు సార్వత్రిక ఎన్నికల గురించి. బీజేపీని ఏకి పారేశారు. మోదీపై మండిపడ్డారు. ప్రజలు ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు. 2004లో సృష్టించిన చరిత్ర తిరిగి 20 ఏళ్ల తర్వాత పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఎంకే స్టాలిన్.
గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలోని 143 కోట్ల మంది భారతీయులు ప్రస్తుతం కొలువు తీరిన మోదీ సర్కార్ పట్ల భయంతో ఉన్నారని చెప్పారు. పళని స్వామి, మోవడీ, అమిత్ షాలు చేసే జిమ్మిక్కులను తమిళులు నమ్మరని కుండ బద్దలు కొట్టారు ఎంకే స్టాలిన్.
తమిళులకు వ్యతిరేకంగా వారు ఏపని చేసినా అది రాజకీయ సమాధిగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒక రకంగా ఇలాగే బీజేపీ గనుక గెలిస్తే దేశం ఫాసిజంగా మారక తప్పదన్నారు . వారు గత కొన్నేళ్లుగా తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చారని , కానీ తాను తట్టుకుని నిలబడ్డానని అన్నారు.
తమిళనాడులో బీజేపీ ఆటలు సాగవన్నారు. అమిత్ షా కుట్రలు ఇక్కడ వర్కవుట్ కావన్నారు ఎంకే స్టాలిన్.