బీఆర్ఎస్ సమన్వయకర్తల ఎంపిక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల సందర్భంగా మెదక్ పార్లమెంట్ కు సంబంధించి కో ఆర్డినేటర్లను నియమించారు.
సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు కేటీఆర్. పటాన్ చెరుకు భూపాల్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గానికి డాక్టర్ యాదవ్ రెడ్డిని నియమించారు . మెదక్ శాసన సభకు చిట్టి దేవేందర్ రెడ్డికి అప్పించారు. ఆయన ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ గా ఉన్నారు.
పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మనోహర్ రావుకు దుబ్బాక నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు కేటీఆర్. గజ్వేల్ కు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న రోజా రాధాకృష్ణ శర్మ కు అప్పగించారు కేటీఆర్. సిద్దిపేట శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ను నియమించారు .
పార్లమెంట్ ఎన్నికలపై కో ఆర్డినేటర్లు ఫోకస్ పెట్టాలని సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.