పాలమూరు జిల్లా బీఆర్ఎస్ కోర్డినేటర్లు
ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్ – పాలమూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మాజీ మంత్రి కేటీఆర్. లోక్ సభ పరిధిలోని శాసన సభ స్థానాలకు గాను కో ఆర్డినేటర్లను ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ ఈ విషయాన్ని వెల్లడించింది.
మహబూబ్ నగర్ శాసన సభ నియోజకవర్గానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ గుప్తాను , జడ్చర్లకు సీనియర్ నాయకులు ఇబ్రహీం, మక్తల్ కు ఎండీ సలీంను నియమించారు కేటీఆర్. దేవరకద్రకు పల్లె రవి కుమార్ గౌడ్ , కోడంగల్ కు మాజీ శాప్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డికి బాద్యతలు అప్పగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
ఇక షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల రాజు యాదవ్ ను, నారాయణ పేటకు మాజీ చైర్మన్ రాజా వర ప్రసాద్ ను నియమించారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.