బీఆర్ఎస్ సమన్వయకర్తలు వీరే
ప్రకటించిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన మొత్తం 17 లోక్ స్థానాలకు గాను ఆయా లోక్ సభ పరిధిలో ఉన్న శాసన సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు.
ఇందులో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను ఎంపిక చేశారు. కోరుట్లకు ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఆర్మూర్ కు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
బాల్కొండకు ఎల్ఎంబీ రాజేశ్వర్ , నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి గంగాదర్ గౌడ్ , బోధన్ కు డి. విఠల్ రావు , జగిత్యాలకు దావా వసంత్ రావు ను నియమించారు కేటీఆర్. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు.