NEWSNATIONAL

జ‌గ‌న్ డ్రామాలు ఇక చెల్ల‌వు

Share it with your family & friends

నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – జ‌గ‌న్ రెడ్డి నాట‌కాలు న‌మ్మే స్థితిలో ప్ర‌జ‌లు లేర‌న్నారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌జాగ‌ళం ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న‌వ ర‌త్నాలు పేరుతో జ‌నం చెవుల్లో పూలు పెట్టిన ఘ‌న‌త సీఎంకే ద‌క్కుతుంద‌న్నారు.

పాల‌న గాడి త‌ప్పింద‌ని, ఏపీపై అప్పుల భారం పెరిగింద‌ని, రాష్ట్రాన్ని అధోగ‌తి పాలు చేసిన వైనం దారుణ‌మ‌న్నారు. త‌న‌పై తాను రాయి వేయించుకుని ప్ర‌జ‌ల నుంచి సానుభూతి పొందాల‌ని చూసిన జ‌గ‌న్ రెడ్డిని న‌మ్మే రోజులు పోయాయ‌ని ఎద్దేవా చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

క‌ట్టు క‌థ‌లు , క‌నిక‌ట్టు చేయ‌డం జ‌గ‌న్ రెడ్డికి బాగా తెలుస‌న్నారు. అబ‌ద్ద‌పు హామీల‌తో గ‌ద్దెనెక్కిన జ‌గ‌న్ రెడ్డి త‌న నాలుగున్న‌ర ఏళ్ల పాల‌న‌లో రాచ‌రికపు పోక‌డ పోయాడ‌ని, చివ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను ఓట్లు వేయ‌మంటూ అడుక్కునే స్థాయికి దిగ‌జారాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

త‌మ‌కు 150 కి పైగా అసెంబ్లీ సీట్లు వ‌స్తాయ‌ని ఇక 20కి పైగా లోక్ స‌భ స్థానాలు ద‌క్కుతాయ‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.