ఆనం చరిత్ర హీనుడు
ఎంపీ విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – ఆనం రామ నారాయణ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ విజయ సాయి రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఆనంను రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చి , పెద్దోడిని చేసింది దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని స్పష్టం చేశారు.
ఆయన అకాల మరణంతో జగన్ మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టించి, జైలుకు పంపించిన కాంగ్రెస్ హైకమాండ్ పన్నిన కుట్రలో ఆనం రామ నారాయణ రెడ్డి భాగస్వామి అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్‌ట్ర విభజన తర్వాత అటు ఇటు తిరిగి మళ్లీ జగన్ పంచన చేరాడని తెలిపారు. ఆయనను నమ్మి , చేసిన తప్పులు మన్నించిన జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సపోర్ట్ చేశారని చెప్పారు.
కానీ వెన్ను పోటు గుణం కలిగిన ఆయన తన గుణాన్ని పోనిచ్చు కోలేదన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఈ వయసులో పార్టీ మారి చరిత్ర హీనుడిగా మిగిలి పోయాడని ధ్వజమెత్తారు. ఎవరు పార్టీని వీడినా తమకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ మరోసారి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు.