ప్రజా సంక్షేమం టీఎంసీ జపం
2024 ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్
పశ్చిమ బెంగాల్ – పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా టీఎంసీ చీఫ్ , సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. కూలీలకు భరోసా ఇస్తూ రూ. 400 రోజూ వారీ వేతనంతో జాబ్ కార్డు దారులకు 100 రోజుల పని ఇచ్చేలా చేస్తామని పేర్కొంది. పేద కుటుంబాలకు చెందిన వారికి ఉచితంగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది టీఎంసీ పార్టీ.
సంవత్సరానికి బీపీఎల్ కు 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని , రేషన్ కార్డు హోల్డర్లందరికీ ఇంటి వద్దకే ఉచితంగా రేషన్ డెలివరీ చేస్తామని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉన్నత విద్య కోసం సాయం చేస్తామని తెలిపింది. వృద్దులకు నెలకు రూ. 1,000 చొప్పున పెన్షన్ అందజేస్తామని స్పష్టం చేసింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.
ఈ మేరకు స్వామి నాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని ప్రకటించింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపింది. 25 ఏళ్ల లోపు గ్రాడ్యుయేట్ , డిప్లొమా హోల్లర్డల కోసం అప్రెంటిషిప్ అందజేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. సీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీని వ్యతిరేకిస్తామని, బాలికల కోసం కన్యాశ్రీ పథకం తీసుకు వస్తామని తెలిపింది.