బీఆర్ఎస్ కోఆర్డినేటర్ల ఎంపిక
ప్రకటించిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని భారత రాష్ట్ర సమితి పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం జరగబోయే 17 లోక్ సభ స్థానాలకు సంబంధించి ఆయా ఎంపీ పరిధిలోని అసెంబ్లీ నియోజకర్గాలకు కోఆర్డినేటర్లను నియమించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడి పోయింది.
కానీ ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఇప్పటికే అన్ని ఎంపీ స్థానాలకు కోఆర్డినేటర్లను ప్రకటించారు కేటీఆర్. తాజాగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు బాధ్యులను ఖరారు చేశారు.
పాలేరు శాసన సభ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఉన్న తాత మధును సమన్వయకర్తగా ఎంపిక చేశారు. ఖమ్మం నియోజకవర్గానికి మాజీ డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, వైరాకు సీనియర్ నేత తాళ్లూరి జీవన్ , మధిర నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వర్ రావుకు బాధ్యతలు అప్పగించారు.
కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి సీనియర్ నేత ఉప్పలపాటి వెంకట రమణ, సత్తుపల్లికి బీరెడ్డి నాగ చంద్రా రెడ్డి, అశ్వారావు పేట నియోజకవర్గానికి కోనేరు చిన్నని ఎంపిక చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.