రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు రెడీనా
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి సీఎంకు, ఆయన మంత్రులకు అలవాటుగా మారిందన్నారు. 420 హామీలను ఇచ్చి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిందని ఆరోపించారు.
ఇక ఆర్టీసీ కోసం తమ ప్రభుత్వం గతంలోనే రూ. 3,000 కోట్లను బడ్జెట్ లో కేటాయించినట్లు చెప్పారు హరీశ్ రావు. గత ఏడాది నవంబర్ నాటికే ఆర్టీసీకి తామే రూ. 1500 కోట్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ వచ్చాక తాము కేటాయించిన వాటి లోంచే ఇస్తున్నారు తప్ప కొత్తగా ఆర్టీసికి ఇచ్చింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
మరో వైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ముందు తాను ఎవెరెవరిపై ఫోన్ ట్యాపింగ్ చేయించారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తమపై లేనిపోని విమర్శలు గుప్పిస్తున్న సీఎం దమ్ముంటే బయటకు రావాలని, లై డిటెక్టర్ టెస్టింగ్ కు తాను కూడా రావాలని తనతో పాటు కేటీఆర్ కూడా వస్తామని సవాల్ విసిరారు.