కేరళలో రేవంత్ ప్రచారం
పెద్ద ఎత్తున హాజరైన జనం
కేరళ – పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించారు. ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కేవలం మోదీ ఒక్కడే రాజుగా ఉండాలని కోరుకుంటున్నాడని ఆరోపించారు.
ప్రజలు ఈసారి ఎన్నికల్లో తమ విజ్ఞతను ప్రదర్శించాలని కోరారు. లేక పోతే దేశ భవిష్యత్తు అత్యంత ప్రమాదంలో పడే ఛాన్స్ లేక పోలేదన్నారు. దేశానికి చెందిన వనరులను గంప గుత్తగా కొందరికే కట్ట బెడుతూ ప్రచారం చేసుకుంటున్న తీరు దారుణమన్నారు.
నిరుద్యోగం అంత కంతకూ పెరుగుతోందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కేవలం కొద్ది మంది బడా బాబులకు మేలు చేకూర్చేందుకే ప్రధానమంత్రి పని చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.