NEWSNATIONAL

డీఎంకే చాప్ట‌ర్ క్లోజ్ – అన్నామ‌లై

Share it with your family & friends

బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

త‌మిళ‌నాడు – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై కుప్పు స్వామి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న డీఎంకే పార్టీని, ఆ పార్టీ చీఫ్ సీఎం ఎంకే స్టాలిన్ ను ఏకి పారేశారు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ ప‌నితీరును ఎండ గ‌డుతూ వ‌స్తున్నారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌ను ఇచ్చి జ‌నాన్ని బురిడీ కొట్టించారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ప్ర‌స్తుతం కె. అన్నామ‌లై కుప్పు స్వామి కోయంబ‌త్తూరు నుంచి లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో పోటీలో ఉన్నారు. ఈ సంద‌ర్బంగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌నితీరు బాగో లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు.

కేంద్ర స‌ర్కార్ భారీ ఎత్తున నిధుల‌ను మంజూరు చేసింద‌ని, వాటిని ప‌క్క‌దారి ప‌ట్టించారంటూ సీఎం స్టాలిన్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కె. అన్నామ‌లై కుప్పుస్వామి. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో బీజేపీకి ఢోకా లేద‌న్నారు. దానిని అడ్డుకునే శ‌క్తి ఏ పార్టీకి లేద‌ని స్ప‌ష్టం చేశారు బీజేపీ చీఫ్‌.

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, త‌మ‌కు ఈసారి ఎన్నిక‌ల్లో 400 సీట్ల‌కు పైగానే వ‌స్తాయ‌న్నారు. ఇక త‌మిళ‌నాడులో క్లీన్ స్వీప్ చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు కె. అన్నామ‌లై కుప్పుస్వామి.