రాజా సింగ్ భారీ ర్యాలీ
నో పర్మిషన్ అన్న పోలీస్
హైదరాబాద్ – బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని శోభా యాత్రను చేపట్టారు. ఈ యాత్రకు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అయితే ఈ శోభా యాత్రకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పోలీసులు ప్రకటించారు. కానీ పర్మిషన్ తీసుకోకుండానే యాత్ర చేపట్టడం కలకలం రేపింది. దీనిపై ప్రస్తుత నగర పోలీస్ కమిషనర్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
డప్పు దరువులు, డీజే సంగీతానికి అనుగుణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు యాత్రలో పాల్గొన్నారు. హిందుత్వాన్ని కీర్తిస్తూ పాటలు కూడా పాడారు. అయితే ఎన్నికలు ప్రస్తుతం జరుగుతుండడంతో కోడ్ అమలులో ఉంది.
ఏ పార్టీ అయినా లేదా ఎవరైనా సరే ర్యాలీలు నిర్వహించలన్నా, సభలు పెట్టాలన్నా ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై రాజాసింగ్ ఏమన్నారంటే తాము ముందస్తుగానే సమాచారం అందించామని, తమ రాజ్యంలో ఇంకొకరి అనుమతి ఎందుకని ప్రశ్నించారు. మొత్తంగా తాను టైగర్ నంటూ నిరూపించుకున్నారు రాజా సింగ్.