జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్
అమరావతి – రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. ఈ కార్యక్రమం పెడన, మచిలీపట్నం నగరాలలో చోటు చేసుకుంది.
ఈ సందర్బంగా టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా గళం సభలను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు నాయుడు. ఇక కూటమి విజయం ఖాయమై పోయిందని, తను పెట్టే బేడా సర్దుకోవడమే మిగిలి ఉందన్నారు .
పండుగ రోజు అని కూడా చూడకుండా సామాజిక బాధ్యతగా వేలాదిగా తరలి వచ్చినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు జనసేన పార్టీ చీఫ పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో జన రంజక, ప్రజా పాలన అందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు రావడానికి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక కూటమి గెలుపును ఏ శక్తి అడ్డు కోలేదన్నారు.