కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శాపం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఓ వైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ప్రచారంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీకి, సర్కార్ కు ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. ఓ వైపు అన్నదాతలు నానా తంటాలు పడుతుంటే చూస్తూ ఊరుకున్నారే తప్పా పరిష్కరించడం లేదని వాపోయారు. రాజకీయ ప్రయోజనాలకే ప్రయారిటీ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. తమ నాయకుడు కేసీఆర్ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంటే ఎద్దేవా చేస్తున్నారని ఇదేనా ప్రజా పాలన అంటే అని ఫైర్ అయ్యారు కేటీఆర్.
మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమత్తులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కెసిఆర్ ఇప్పటికే చెప్పారని తెలిపారు. ఎల్ అండ్ కంపెనీ కట్టేందుకు ముందుకు వచ్చినా ఇప్పటి వరకు చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు కేటీఆర్.