బాబు తరపున భువనేశ్వరి నామినేషన్
రేపే ముహూర్తం నిర్ణయించిన టీడీపీ
అమారవతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన ఏప్రిల్ 19న శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పంలో కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు.
ఇదిలా ఉండగా తొలిసారిగా చంద్రబాబు నాయుడు తరపున నామినేషన్ దాఖలు చేయనున్నారు ఆయన భార్య భువనేశ్వరి..చంద్రబాబు తరపున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్నారు.. ఉదయం కుప్పంలోని వరదరాజుల స్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు చేస్తారని పార్టీ తెలిపింది.
అనంతరం కుప్పంలో చంద్రబాబు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పేర్కొంది. కుప్పం ప్రజల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది పార్టీ. ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా కుప్పం వెళ్లనున్నారు . ప్రజలతో కలిసి చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వెల్లడించింది.