NEWSNATIONAL

ఈడీ డేంజ‌రస్ గేమ్ – సంజ‌య్ సింగ్

Share it with your family & friends

నివేదిక‌లో కీల‌క ప‌త్రాలు మాయం

న్యూఢిల్లీ – ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ నిప్పులు చెరిగారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ అస‌లు వాస్త‌వాలు దాస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌ధానంగా కోర్టుకు స‌మ‌ర్పించిన నివేదిక‌లో ప‌లు కీల‌క‌మైన పత్రాలు మాయం అయ్యాయ‌ని మండిప‌డ్డారు. ఎవ‌రి ప్ర‌లోభాల‌కు లొంగి పోయి, ఒత్తిళ్ల మేర‌కు వాటిని లేకుండా చేశారో ఈడీ స‌మాధానం చెప్ప‌ల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

దేశంలోని ప్ర‌ధాన ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీ గంప గుత్త‌గా మోడీ చెప్పు చేతుల్లో న‌డుస్తున్నాయంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈడీ డేంజ‌ర‌స్ గేమ్ ఆడుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సంజ‌య్ ఆజాద్ సింగ్.

వాస్తానికి ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఎలాంటి ఆధారాలు ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం కేజ్రీవాల్ కు సంబంధించి దొర‌క లేద‌న్నారు. అయితే ఈ కేసుకు సంబఃధించిన 20 వేల పేజీల‌ను దాస్తోంద‌ని ఆరోపించారు సంజ‌య్ సింగ్. ఈడీ ఛార్జి షీట్ లో 600 పేజీలు గాయ‌బ్ అయ్యాయ‌ని పేర్కొన్నారు.

దేశంలోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సంస్థ‌గా గుర్తింపు పొందిన ఈడీ ఎందుకు దాయాల్సి వ‌స్తుందో బ‌య‌ట‌కు చెప్పాల‌న్నారు సంజ‌య్ ఆజాద్ సింగ్.