సూర్య ప్రతాపం
దంచి కొట్టిన హిట్టర్
పంజాబ్ – ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు సూర్య కుమార్ యాదవ్. రోహిత్ శర్మ 36 రన్స్ చేస్తే , ఇషాన్ కిషన్ నిరావ పరిచాడు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన సూర్య 78 రన్స్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో ఉతికి ఆరేశాడు. సూర్య కుమార్ కు తోడయ్యాడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ. తను కూడా అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిరాశ పరిచాడు. కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. చివరలో వచ్చిన టిమ్ డేవిడ్ 14 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆదిలోనే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు శశాంక్ సింగ్.
ఎక్కడా తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక మైదానం లోకి దిగిన అశు తోష్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. 61 పరుగులతో విరుచుకు పడ్డాడు. కానీ జట్టు చివరి దాకా పోరాడి ఓడి పోయింది.