బీజేపీని ఓడించండి – మాలిక్
ప్రజలు ఇకనైనా మేల్కొనండి
న్యూఢిల్లీ – జమ్మూ కాశ్మీర్, మేఘాలయ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇవాళ తొలి విడత ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని స్పష్టం చేశారు.
మోదీ నియంతృత్వ పోకడ, బీజేపీ మతతత్వ రాజకీయాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీకి ఓటు వేయొద్దని సత్య పాల్ మాలిక్ కోరారు. ఇవాళ రైతులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు , మహిళలు అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, కనీసం మాట్లాడేందుకు స్వేచ్ఛ కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు మాజీ గవర్నర్.
బీజేపీని నామ రూపాలు లేకుండా చేసేందుకు మీ వంతు ప్రయత్నం చేయాలని కోరారు . మోదీ ప్రభుత్వం దేశాన్ని ఎలా వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు, బడా బాబులకు, మోసగాళ్లకు, ఆర్థిక నేరగాళ్లకు వత్తాసు పలుకుతుందో ఆలోచించు కోవాలని సూచించారు.
ఇవాళ దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని వాపోయారు సత్య పాల్ మాలిక్.