ఆప్ సర్కార్ ను కూల్చేందుకు కుట్ర
ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ ఫైర్
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఆప్ ప్రభుత్వాన్ని ఏదో ఒక కారణంతో రద్దు చేయాలని, కూల్చేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేక పోయినా తమ నాయకులను తీహార్ జైల్లో పెట్టిందని ఆరోపించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం బాగో లేదని , ఇక సిసోడియా, సత్యేంద్ర జైన్ ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని వాపోయారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు మోదీ జేబు సంస్థలుగా మారి పోయాయని మండిపడ్డారు సంజయ్ సింగ్. మోడీ, అమిత్ షా ల నేతృత్వంలో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి ఆప్ సర్కార్ కూల్చేందుకు పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు సంజయ్ సింగ్. తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం, న్యాయం ఇంకా బతికే ఉందన్నారు.
తాము సుప్రీంకోర్టుకు వెళతామని ప్రకటించారు. మోదీ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు సంజయ్ సింగ్.