మోడీ దుర్మార్గుడు – కేసీఆర్
మాజీ సీఎం సంచలన కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన గతంలో లేనంతగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. దేశంలోనే అత్యంత డేంజరస్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ప్రధాని ఒక్కడేనని అన్నారు. తనపై కావాలని కక్ష కట్టాడని, అందుకు ప్రతిగా తన కూతురుపై కక్ష తీర్చుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. పీఎం స్థాయిలో ఉన్న మోదీకి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కేవలం రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేశాడని, అది వర్కవుట్ కాలేదన్నారు. తాను ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు.
జైళ్లు, కేసులు , అరెస్ట్ లు తమకు కొత్త కాదన్నారు. కేవలం కొందరి కోసమే పాలన సాగిస్తున్న మోడీకి ఎదురు చెప్పే వారు ఎవరూ ఉండ కూడదని అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను చీల్చేందుకు ప్రయత్నం చేసిన బీఎల్ సంతోష్ ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశామన్నారు. దీనిని జీర్ణించు కోలేని మోదీ ప్రతీకారంగా తన కూతురు , అమాయకురాలైన ఎమ్మెల్సీ కవితను నిరాధారమైన కేసు మోపి తీహార్ జైలుకు పంపించారని ఆరోపించారు కేసీఆర్.