వివేకా హత్యపై గప్ చుప్
ఎవరూ మాట్లాడ వద్దన్న కోర్టు
కడప జిల్లా – మాజీ ఎంపీ , దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యపై కడప కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత కొంత కాలంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. కేసు విచారణలో ఉన్న సమయంలో నేతలు నోరు జారడం, విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని సూచించింది.
ఏ పార్టీకి చెందిన వారైనా , ఎంతటి స్థాయిలో ఉన్నా సరే కొంచెం నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని స్పష్టం చేసింది. లేక పోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందని, వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇందులో భాగంగా వైఎస్ వివేకా హత్యకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది కోర్టు. వైఎస్ వివేకా హత్య గురించి ఏ ఒక్కరు నోరు జారవద్దని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు, కొడుకు లోకేష్ కు, పవన్ కళ్యాణ్ కు, పురందేశ్వరికి, వైఎస్ షర్మిలతో పాటు ఇతర నేతలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది కోర్టు.