కేసీఆర్ కు చాలా థ్యాంక్స్
స్పష్టం చేసిన ఆర్ఎస్పీ
హైదరాబాద్ – బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా లోక్ సభ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ మేరకు ప్రగతి భవన్ లో పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా బి ఫాం అందుకున్నారు.
ఈ సందర్బంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్ర ఆవిర్భావానికి మూల కారకుడైన, ఉద్యమ నేత కేసీఆర్ చేతుల మీదుగా బి ఫాం అందుకోవడం తన జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు. ఈ అపురూపమైన క్షణాలు ఎల్లప్పటికీ భద్రంగా ఉంటాయన్నారు.
కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు జరిపినా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. చివరి క్షణం వరకు ప్రజల కోసం పని చేస్తానని, వారి గొంతుకను వినిపిస్తానని చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి తనను ఆదరించాలని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.