వెంకట రామిరెడ్డిపై వేటు
ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సస్పెండ్
అమరావతి – ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వెంకట రామి రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి బహిరంగంగా ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా బహిరంగంగానే మీడియా సాక్షిగా మద్దతు ఇవ్వడం , ప్రకటించడం చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశాడంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం అయ్యారని, వైసీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం కూడా చేశారంటూ అభియోగాలు మోపారు.
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట రామి రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ లో ఇన్ ఛార్జ్ అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు వెంకట రామిర ఎడ్డి. కడప కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు.