కుప్పం గడ్డ టీడీపీ అడ్డా
నారా భువనేశ్వరి కామెంట్
చిత్తూరు జిల్లా – నారా చంద్రబాబు నాయుడి తరపున శుక్రవారం ఆయన భార్య నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ రెడ్డి కాదు కదా ఆయన తండ్రి దిగి వచ్చినా కుప్పంలో చంద్రబాబు నాయుడు విజయాన్ని ఆప లేరన్నారు. జనం ఆయనను నమ్ముకున్నారని, గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్నారని చెప్పారు.
కుప్పం గడ్డ అనేది టీడీపీకి అడ్డా అన్నారు. ఈసారి ఎన్నికల్లో జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కుప్పంలో పసుపు జెండాకు తప్ప మరో పార్టీ పతాకానికి తావు లేదన్నారు.
చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినప్పుడు తాను నిజం గెలవాలని ప్రజల్లోకి వెళ్లానని అన్నారు. నా పార్టీ బిడ్డల కుటుంబాలను ప్రత్యక్షంగా కలవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు భువనేశ్వరి. ఇవాళ మీ ఆదరాభిమానాలు చూస్తుంటే తన భర్తకు లక్షకు పైగా మెజారిటీ వచ్చేలా ఉందన్నారు.
ఇక జగన్ రెడ్డి పనై పోయిందని, మిగిలేది ప్రమాణ స్వీకారమే ఉందన్నారు భువనేశ్వరి. ప్రజలు జాగ్రత్తతో వ్యవహరించాలని, జగన్ రెడ్డిని నమ్మవద్దని కోరారు.