NEWSTELANGANA

కారు ఇక గ్యారేజ్ కే – రేవంత్ రెడ్డి

Share it with your family & friends

పాత సామాన్ల‌కు అమ్ముకోవాల్సిందే

పాలంమూరు జిల్లా – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీని ఏకి పారేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం కారు పంక్చ‌ర్ అయ్యింద‌ని ఎద్దేవా చేశారు. అది ప‌నికి రాకుండా పోయింద‌న్నారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నీ అయ్య కేసీఆర్ ప‌డి పోయిండ‌ని, కాళ్లు విరిగి న‌డిచేందుకు వీలు లేకుండా ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని అన్నారు.

గ‌తంలో లాగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేద‌న్నారు. ద‌మ్మున్నోడిని తాను వ‌చ్చాక ఎవ‌రు ఏ పార్టీ లోకి వెళ్లేందుకు సాహసం చేయ‌ర‌న్నారు. ప‌దే ప‌దే త‌న స‌ర్కార్ గురించి లేని పోని మాట‌లు మాట్లాడుతున్న కేటీఆర్ ను ఉతికి ఆరేశారు. మీ అయ్య‌ను కాపాడుకో, ఇక నీ పార్టీ ప‌నై పోయింద‌న్నారు. అది ఇప్ప‌ట్లో లేవ‌లేద‌న్నారు. దానిని తుక్కు సామాన్లోకి ఇస్తే బెట‌ర్ అని సూచించారు.

శుక్ర‌వారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంట్ ఎంపీ అభ్య‌ర్థిగా చ‌ల్లా వంశీ చంద‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. కేసీఆర్ కు ఇంకా మ‌త్తు దిగ‌లేద‌న్నారు. ఇంకా ఆయ‌న సీఎం ప‌ద‌విలో ఉన్నాన‌నే భ్ర‌మ‌లో ఉన్నారంటూ మండిప‌డ్డారు.

ఎమ్మెల్యేల‌ను గొర్రెల్లా లాగేసు కునేందుకు ఇది పాత కాంగ్రెస్ పార్టీ కాద‌ని కేసీఆర్, కేటీఆర్ గుర్తు పెట్టు కోవాల‌న్నారు. ఎవ‌రి క‌థ ఏమిటో ఎన్నిక‌ల‌య్యాకు తేలుతుంద‌న్నారు సీఎం.