NEWSTELANGANA

డీకే అరుణ ఆస్తులు రూ.66.4 కోట్లు

Share it with your family & friends

81 వాహ‌నాలు ఉన్నాయ‌న్న నేత

పాల‌మూరు జిల్లా – భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ భ‌ర‌త సింహారెడ్డి చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఆమె ప్ర‌స్తుతం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి యువ నాయ‌కుడు చ‌ల్లా వంశీ చంద‌ర్ రెడ్డిని ఢీకొన‌నున్నారు.

ఈ సీటు అత్యంత ప్రాధాన్య‌త క‌లిగి ఉంది. నిన్న‌టి దాకా ఇదే పార్టీలో కీల‌కమైన నాయ‌కుడిగా పేరు పొందిన మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి చివ‌రి దాకా సీటు ఆశించారు. కానీ భంగ‌ప‌డిన ఆయ‌న ఉన్న‌ట్టుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు.

ఇది ప‌క్క‌న పెడితే డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. తమ కుటుంబానికి చెందిన ఆస్తులు ఏకంగా రూ. 66.4 కోట్లు ఉన్నాయ‌ని తెలిపారు.

అంతే కాదు 81 వాహ‌నాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. త‌న‌తో పాటు త‌న భ‌ర్త‌కు ఇవి ఉన్నాయ‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా డీకే భ‌ర‌త సింహా రెడ్డి పేరు పొందిన కాంట్రాక్ట‌ర్. ఆయ‌న సోద‌రుడు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు డీకే స‌మ‌ర సింహారెడ్డి.