చంద్రబాబు ఆస్తులు రూ. 931 కోట్లు
2019 నుంచి 2023కు 39 శాతం పెంపు
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి ఆస్తులు ఏకంగా రూ. 931 కోట్లుగా ఉండడం విశేషం. పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో తనకు తానే కింగ్ అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది పక్కన పెడితే తను తొలుత కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. దివంగత సీఎం ఎన్టీఆర్ కూతురు నారా భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నారు.
హెరిటేజ్ ఫుడ్స్ ఆయనదే. ఇది తన కోడలు నారా బ్రాహ్మణి నడుపుతోంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటుడు , వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే నందమూరి బాలకృష్ణ కూతురు. కొడుకు నారా లోకేష్. విచిత్రం ఏమిటంటే 2019 నుంచి 2024 వరకు వచ్చే సరికి చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తులు 39 శాతానికి పైగా పెరగడం విస్తు పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా 2019లో చంద్రబాబు ఆస్తులు రూ. 668 కోట్లు, హెరి టేజ్ ఫుడ్స్ , నిర్వాణ హోల్డింగ్స్ , ఇతర కంపెనీలలో చాలా ఆస్తులు భువనేశ్వరి పేరు మీద ఉన్నాయి. ఆమె వద్ద రూ. 3 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలు ఉన్నాయని పేర్కొంది. స్థిరాస్థులు చిత్తూరు, తమిళనాడు, హైదరాబాద్ లో ఉన్నాయని తెలిపింది. ఇక చంద్రబాబు నాయుడు ప్రస్తుతం 24 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.