NEWSTELANGANA

ఆర్టీసీ ద్వారా ప‌చ్చ‌ళ్ల పంపిణీ

Share it with your family & friends

శ్రీ‌కారం చుట్టామ‌న్న వీసీ స‌జ్జ‌నార్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఇప్ప‌టికే వివిధ ప్రాంతాల నుంచి వ‌స్తువుల‌ను పంపిస్తూ గ‌ణ‌నీయ‌మైన ఆదాయాన్ని గ‌డిస్తోంది . ఇందులో భాగంగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్.

వేస‌వి కాలంలో మామిడి కాయ‌లు ఎక్కువ‌గా అందుబాటులోకి వ‌స్తాయి. ప్ర‌తి ఒక్క‌రు మామిడి కాయ ప‌చ్చ‌డిని ఇష్ట ప‌డ‌తారు. ఈ మేర‌కు ఆవ‌కాయ ప‌చ్చ‌డి ప్రియుల‌కు శుభ‌వార్త చెప్పారు వీసీ స‌జ్జ‌నార్. అమ్మ‌మ్మ చేతి ఆవ‌కాయ ప‌చ్చ‌డిని బంధువులు, స్నేహితుల‌కు టీఎస్ఆర్టీసీ ద్వారా సులువుగా పంపించు కోవ‌చ్చ‌ని తెలిపారు.

మీ సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు చేరేవేసే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోంద‌న్నారు. తెలంగాణతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తోంద‌న్నారు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాల‌ని కోరారు వీసీ స‌జ్జ‌నార్.