నెలలైనా వేతనాలివ్వని సర్కార్
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. మూడు నెలలైనా ఇప్పటి వరకు గురుకులాలలొ పని చేసే వారికి వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ ఆచరణలోకి వచ్చే సరికి అవి గడప కూడా దాటడం లేదంటూ మండిపడ్డారు. తాము పవర్ లోకి వస్తే ఒకటో తారీఖునే అందరికీ జీతాలు ఇస్తామన్న సర్కార్ 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు జీతాలు ఇవ్వలేక పోయారంటూ ప్రశ్నించారు తన్నీరు హరీశ్ రావు.
ప్రచారం బాగా చేసుకుంటోందని కానీ వారి పాలిట సర్కార్ శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గురుకులాలల్లో పని చేస్తున్న ఐసీటీ కంప్యూటర్ టీచర్లకు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో వారంతా అప్పుల పాలై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు తన్నీరు హరీశ్ రావు. ఆ కుటుంబాలు ఇకనైనా రోడ్డున పడకుండా ఉండేలా చూడాలని కోరారు మాజీ మంత్రి.