ఏపీలో కూటమి చాప్టర్ క్లోజ్
ఎంపీ విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – టీడీపీ కూటమిపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా స్థానికులతో ముచ్చటించారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఇదే సమయంలో దోశెలు వేస్తున్న ఆమె వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు విజయ సాయి రెడ్డి.
ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వై నాట్ 175 అన్నది తమ లక్ష్యమని ఆ దిశగా తాము ప్రయాణం చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలయిక వల్ల ఒరిగింది ఏమీ ఉండదన్నారు విజయ సాయి రెడ్డి.
గతంలో ఎన్నడూ లేనంతగా ఇవాళ ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గడప గడపకు సంక్షేమ పథకం అమలు జరిగేలా చూశామన్నారు. తమ సర్కార్ విద్య, వైద్యం, ఉపాధి, పరిశమ్రల ఏర్పాటుపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని చెప్పారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఫ్యాన్ గాలికి కూటమి గాయబ్ కావడం ఖాయమన్నారు.