SPORTS

హైద్రాబాద్ భ‌ళా ఢిల్లీ విల‌విల‌

Share it with your family & friends

భారీ తేడాతో పంత్ సేన ఓట‌మి

న్యూఢిల్లీ – ఐపీఎల్ 2024లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ దుమ్ము రేపుతోంది. భారీ స్కోర్ల‌తో హోరెత్తిస్తోంది. రికార్డుల మోత మోగిస్తోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు ముచ్చెమ‌ట‌లు పోయిస్తోంది. ఒక‌రిని మించి మ‌రొక‌రు దుమ్ము రేపుతున్నారు. దంచి కొడుతున్నారు. ఎస్ ఆర్ హెచ్ కొట్టిన దెబ్బ‌కు ఢిల్లీ విల విల లాడింది. అత్య‌ధిక స్కోర్ న‌మోదు చేసింది. 67 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది.

తొలుత బ్యాటింగ్ కు దిగిన హైద్రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 266 ర‌న్స్ చేసింది. మ‌రోసారి రెచ్చి పోయారు ట్రావిస్ హెడ్ , షాబాజ్ , అభిషేక్ శ‌ర్మ చుక్క‌లు చూపించారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు.

హైద‌రాబాద్ బౌల‌ర్ న‌ట‌రాజ‌న్ క‌ళ్లు చెదిరే బంతుల్ని విసిరాడు. ఢిల్లీని శాసించాడు. కేవ‌లం 19 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇరు జ‌ట్లు క‌లిసి 465 ర‌న్స్ చేశాయి. ఇందులో 40 ఫోర్లు, 31 సిక్స్ లు ఉన్నాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వస్తే ట్రావిస్ హెడ్ 32 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. 89 ర‌న్స్ చేశాడు. అభిషేక్ శ‌ర్మ 12 బంతులలో 2 ఫోర్లు 6 సిక్స్ లు కొట్టాడు. షాబాజ్ అహ్మ‌ద్ 29 బంతులు ఆడి 2 ఫోర్లు 5 సిక్స‌ర్లతో 59 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కూడా దాడి ప్రారంభించింది. ముఖ్యంగా బేక్ ఫ్రేజ‌ర్ 18 బంతులు ఎదుర్కొని 65 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 7 సిక్స్ లుఉన్నాయి. పంత్ 44 ప‌రుగులు చేస్తే అభిషేక్ శ‌ర్మ 42 ర‌న్స్ తో ఆక‌ట్టుకున్నారు. కానీ ఫ‌లితం లేకుండా పోయింది. హెడ్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.