SPORTS

న‌ట‌రాజ‌న్ సెన్సేష‌న్

Share it with your family & friends

సూప‌ర్ బౌలింగ్ తో షాక్

న్యూఢిల్లీ – ఐపీఎల్ 2024లో జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ చ‌రిత్ర సృష్టించింది. రికార్డుల మోత మోగించింది. ప‌రుగుల వ‌ర‌ద పారించింది. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఏక‌ప‌క్షంగా సాగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో హైద‌రాబాద్ జ‌ట్టు ఏకంగా మ‌రోసారి భారీ స్కోర్ సాధించింది. 266 ర‌న్స్ చేసింది.

ట్రావిస్ హెడ్ , అభిషేక్ శ‌ర్మ‌, షాబాజ్ అహ్మ‌ద్ లు పిచ్చ కొట్టుడు కొట్టారు. ఇరు జ‌ట్లు క‌లిసి 40 ఫోర్లు 31 సిక్స‌ర్లు కొట్టారు. మైదానం మొత్తం ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. ఒకానొక స‌మ‌యంలో 300 ర‌న్స్ ఏమైనా హైద‌రాబాద్ చేస్తుందా అన్న అనుమానం క‌లిగింది.

ట్రావిస్ దుమ్ము రేపితే అభిషేక్ చుక్క‌లు చూపించాడు. ఇక షాబాజ్ దంచి కొట్టాడు. అనంత‌రం ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను కోలుకోనీయ‌కుండా చేశాడు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు బౌల‌ర్ టి. న‌ట‌రాజ‌న్. క‌ళ్లు చెదిరే బంతుల‌తో ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌త్య‌ర్థి ప్లేయ‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. కేవ‌లం 4 ఓవ‌ర్లు మాత్ర‌మే వేసిన న‌ట్టూ 19 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 4 కీల‌క వికెట్లు తీశాడు. ఢిల్లీ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు.