మోదీ సర్కార్ ఫిర్ ఏక్ బార్
సీఎం యోగి ఆదిత్యా నాథ్
రాజస్థాన్ – దేశంలో మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని జోష్యం చెప్పారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ లో పర్యటించారు.
జోధ్ పూర్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో యోగి పాల్గొన్నారు. భారీ ఎత్తున జనం ఆదరించారు. పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి అంత సీన్ లేదన్నారు.
దేశంలోని భారతీయులంతా ముక్త కంఠంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ రెండింటిని సమకూర్చే సత్తా ఒక్క తమ పార్టీకే ఉంటుందని అన్నారు యోగి ఆదిత్యానాథ్.
ఆబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో పుణ్య భూమి నినదిస్తోందన్నారు సీఎం. రాజస్థాన్ ను చూసినప్పుడల్లా తనకు అంతులేని సంతోషం కలుగుతుందన్నారు.