మహిళా సాధికారతపై ఫోకస్
స్పష్టం చేసిన నారా బ్రాహ్మణి
మంగళగిరి – మహిళలు అన్ని రంగాలలో రాణించాలంటే స్వయం కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు నారా లోకేష్ భార్య, హెరిటేజ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి . మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా సంఘాల మహిళలను కలిశారు.
నియోజకవర్గంలోని ప్రజలందరికీ మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. ఈ క్రెడిట్ నారా లోకేష్ కు, పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు నారా బ్రాహ్మణి.
ఇందులో భాగంగా స్త్రీ శక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మహిళలను స్వావలంబన దిశగా ముందుకు సాగేలా ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 32 బ్యాచ్ లకు కుట్టు శిక్షణలో నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
1600 మందికి కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు కూడా అందజేసినట్లు తెలిపారు నారా బ్రాహ్మణి. స్త్రీశక్తి మహిళల ఆదాయం పెంపుదలకు అధునాతన డిజైన్లలో తర్ఫీదు ఇచ్చి మార్కెట్ లింకేజి కూడా చేస్తున్నామన్నారు.