కావ్య ప్రీతి జింతా వైరల్
అందరి కళ్లు వారి పైనే
పంజాబ్ – ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2024 లో సగానికి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ కు వెళ్లే జట్టలలో ముందు వరుసలో ఉన్నాయి కేరళ స్టార్ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ . ఇది పక్కన పెడితే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు యజమాని, ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆమె తన జట్టును ఉత్సాహ పరుస్తున్నారు.
ఇదే సమయంలో మరికొందరు ముద్దుగుమ్మలు హాట్ టాపిక్ గా మారారు. ఒక రకంగా ఎవరీ కావ్య అంటూ , ఆమె వెనుక కథేంటి అంటూ నెట్టింట్లో తెగ చర్చించు కుంటున్నారు. ఓ వైపు కావ్య పాప మరో వైపు ప్రీతి జింతా ఇద్దరూ మైదానంలో కలుసుకునన్నారు. తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఇక గత ఐపీఎల్ సీజన్ లో తీవ్ర నిరాశ పరిచిన సన్ రైజర్స్ జట్టు దుమ్ము రేపుతోంది. ఆ జట్టు యజమానురాలు కావ్య మారన్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఆమె తను కావాలని కోరుకున్న ఆటగాళ్లు దంచి కొడుతున్నారు.
ఇంటర్నెట్ ను షేక్ చేస్తున కావ్య మారన్ ఓ వైపు కాగా మరో వైపు కావ్య కూడా ఆమె సరసన చేరడం మరింత ఆసక్తిని రేపింది. మొత్తంగా ముద్దుగుమ్మలతో ఐపీఎల్ కళకళ లాడుతోంది.