చెట్టు ఎక్కిన మంత్రి
ఆదరించాలని కోరిన జూపల్లి
నాగర్ కర్నూల్ జిల్లా – రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు సంచలనంగా మారారు. ఆయన భిన్నంగా ప్రచారం చేపట్టారు. ప్రస్తుతం ఆయన కొల్లాపూర్ శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడుగా ఉన్నారు. అనంతరం ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ ప్రజల కోసం జైలుకు కూడా వెళ్లారు.
సౌమ్యుడిగా పేరు పొందిన జూపల్లి కృష్ణారావు తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మంత్రిగా పని చేశారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.
ఊహించని రీతిలో గెలుపొందడమే కాకుండా కేబినెట్ లో చేరారు . ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆయనకు మాత్రమే చోటు దక్కింది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా బోడబండ తాండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విచిత్రం ఏమిటంటే చెట్టు ఎక్కి ప్రచారం నిర్వహించడం , ప్రజల తో మాట్లాడటం ఆసక్తిని రేపుతోంది.