ఇండియా కూటమికి ఓటమి తప్పదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామెంట్
మహారాష్ట్ర – ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమిపై నిప్పులు చెరిగారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలో పర్యటించారు. బీజేపీ ఎన్డీయే విజయాన్ని ఏ శక్తి ఆపలేదన్నారు పీఎం.
ఈసారి సరికొత్త రికార్డు సాధించడం ఖాయమని చెప్పారు. మరాఠా ప్రజలు పెద్ద ఎత్తున కాషాయాన్ని ఆదరిస్తున్నారని అన్నారు. తమ లక్ష్యం ఒక్కటేనని ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లకు పైగా సాధించడం ఖాయమన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
మరాఠా లోని పర్బానీలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల గురించి ఆలోచించడం మానేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి.
కానీ రాబోయే 2047 సంవత్సరం గురించి ఆలోచిస్తున్నట్లు , ఇందుకోసం ప్లాన్స్ కూడా రెడీగా ఉంచుకున్నట్లు స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. ప్రపంచంలోనే భారత్ ను టాప్ 5లో ఉంచాలన్నదే తన అభిమతమన్నారు.