నారాయణ నిలువు దోపిడీ
విజయ సాయి రెడ్డి కామెంట్
నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణపై భగ్గుమన్నారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలని లెక్కకు మించి డబ్బులను ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
ఇక్కడ పెట్టే ప్రతి పైసా నారాయణ విద్యా సంస్థలలో చదువుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దౌర్జన్యంగా వసూలు చేసిన డబ్బులేనంటూ ఎద్దేవా చేశారు. ఈ వందల కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
చదువులను వ్యాపారంగా మార్చిన ఘనత నారాయణకే దక్కుతుందన్నారు. ఈ నిలువు దోపిడీకి పాల్పడుతున్నా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఖండించిన పాపాన పోలేదన్నారు . విద్యా రంగం సర్వ నాశనం కావడానికి ఈ ఇద్దరే కారణమని ఆరోపించారు ఎంపీ.
ఎలాగూ నారాయణ ఓడి పోవడం ఖాయమని, ఇక ఇక్కడ పెట్టిన డబ్బులను తిరిగి విద్యార్థులపై భారం మోపడం, అధికంగా వసూలు చేయడం తప్పదన్నారు. ప్రజలు గమనించి ఆయనను ఓడించాలని పిలుపునిచ్చారు విజయ సాయి రెడ్డి.