లోగో మార్పుపై స్టాలిన్ కన్నెర్ర
కేంద్ర సర్కార్ తీరుపై ఆగ్రహం
తమిళనాడు – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడంతో పాటు వాటిపై కాషాయ పెత్తనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 75 ఏళ్లుగా విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్న దూరదర్శన్ ఛానల్ కు సంబంధించి ఎన్నికల సమయంలో లోగోను మార్చడంపై అభ్యంతరం తెలిపారు ఎంకే స్టాలిన్. ఈ సందర్బంగా ఒక్క దూరదర్శనే కాకుండా ఇతర తమిళ ప్రాంతానికి చెందిన పలు పదాలను మార్చారంటూ మండిపడ్డారు సీఎం.
ప్రపంచానికి ఒక రహస్యాన్ని అందించిన వల్లు వార్ కు వారు ఓచర్ ను ప్రయోగించారని గుర్తు చేశారు. తమిళనాడుకు చెందిన మహనీయుల విగ్రహాలపై కాషాయ రంగు పోసి అవమానించారని, రేడియోకు ఉన్న స్వచ్ఛమైన తమిళ పేరున ఆకాశవాణిగా సంస్కృత పేరు పెట్టారని ధ్వజమెత్తారు.
అంతే కాకుండా పోతికై అనే అందమైన తమిళ పదాన్ని మార్చారని, ప్రస్తుతం దూరదర్శన్ కు ఉన్న గుర్తును కూడా తమ పార్టీ కలర్ లోకి చేర్చడం దారుణమన్నారు. ఫాసిజ భావజాలానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు ఎంకే స్టాలిన్.